బోధన్లో ఉగ్ర మూలాలు ఉన్న ఓ వ్యక్తిని NIA బృందం బుధవారం అదుపులోకి తీసుకుంది. ఐసీస్తో సంబంధాలు కలిగి ఉన్న వారిపై నిఘా క్రమంలో NIA అధికారులు డానీష్ అనే వ్యక్తిని ఝార్ఖండ్లో అరెస్ట్ చేశారు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు బోధన్లో ఉగ్రమూలాలు కలిగిన వ్యక్తిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచి NIA కస్టడీకి తీసుకున్నారు. అతని నుంచి తుపాకీ స్వాధీనం చేసుకోని.. విచారిస్తున్నారని పోలీసు వర్గాలు తెలిపాయి