తాండూరు మండలంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను తాండూర్ ఎస్సై కిరణ్ కుమార్ సందర్శించారు నిర్వాహకులకు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు పండుగను ఆనందంగా జరుపుకునే క్రమంలో భద్రత నియమాలను తప్పనిసరిగా పాటించాలన్నారు గణేష్ మండపాల గురించి ఎవరైనా ఆన్లైన్ చేసుకోకపోతే పోలీసు వారికి సమాచారం అందించాలన్నారు మండపాల వద్ద ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా నిర్వాహకులు పూర్తి బాధ్యత వహించాలన్నారు