యూరియా సరఫరాలో కాంగ్రెస్, బిజేపి ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ ఎడ్ల సోమిరెడ్డి ఆరోపించారు. బుధవారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరితో నేడు రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని అన్నారు. రాష్ట్రంలో యూరియా కొరతతో అతలాకుతలం అవుతున్నారని మండిపడ్డారు. వినాయక చవితి పండుగ రోజు కూడా రైతులు యూరియా కోసం క్యూ లైన్ లో నిలబడడం అత్యంత బాధాకరమైన విషయమని అన్నారు. అంతే కాకుండా వర్షంలో సైతం గొడుగులు పట్టుకొని అవస్థలు పడుతున్నారని, కాంగ్