అక్రమ మద్యం నిల్వలను గుర్తిoచాలని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో నోడల్ డిప్యూటీ కమిషనర్ ఎం.శంకరయ్య జగ్గయ్యపేటలో సిబ్బందిని ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీలు చేశారు. రికార్డులు, కేసుల పురోగతిని పరిశీలించారు. ఎన్నికల నేపథ్యంలో మద్యంను అక్రమంగా నిల్వఉంచే అవకాశం ఉందని అన్నారు. సిబ్బంది నిరంతరం అప్రమతంగా ఉంటూ నాటుసారా, మాదకద్రవ్యాలు, అక్రమ మద్యానికి సంబంధించిన నేరాలను పూర్తి స్థాయిలో అరికట్టాలని ఆదేశించారు.