మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట లో గురువారం ఉదయం వరకు 12 సెంటీమీటర్ల వర్షం నమోదయిందని అధికారులు తెలిపారు. కుండపోతగా కురుస్తున్న వర్షానికి పెద్ద శంకరంపేట మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఇళ్లల్లోకి నీరు వచ్చి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు. అధికారులు సహాయం చేయాలని కోరుతున్నారు.