ప్రజలపై విద్యుత్ చార్జీల భారం, ప్రభుత్వ ప్రమాదకర విధానాలపై విద్యుత్తు అమరుల స్ఫూర్తితో మరో పోరాటాన్ని చేసేందుకు సిద్ధం కావాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సిహెచ్ చంద్రశేఖర్, సిపిఐ కోడూరు నియోజకవర్గ కార్యదర్శి జ్యోతి చిన్నయ్య పిలుపునిచ్చారు. రైల్వే కోడూరులో గురువారం సిపిఎం, సిపిఐ, వామపక్షాల ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద బషీర్బాగ్ విద్యుత్ అమరవీరుల స్ఫూర్తిగా రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు, స్మార్ట్ మీటర్లు, ట్రూ ఆప్ చార్జీలు, విద్యుత్ చార్జీలు, పెంపు ఉపసంహరించాలని నిరసన తెలిపారు.