ఏజెన్సీ ఏరియాలోని మారుమూల దట్టమైన అటవీ ప్రాంతాలలో నివసిస్తున్న గిరిజనులకు పీఎం ధర్తీ ఆభాజాన్ జాతీయ గౌరవ ఉత్కర్ష అభియాన్ పథకంలో భాగంగా గిరిజనులను చైతన్యపరిచి వారికి కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా సంబంధిత అధికారులు అవగాహన కల్పించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. మంగళవారం నాడు జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాహుల్,అదనపు కలెక్టర్ వేణుగోపాల్ మరియు ఇతర అధికారులతో సమావేశం నిర్వహించారు