సూర్యాపేట జిల్లా: సీజనల్ వ్యాధులు ప్రభలకుండా ప్రతి ఒక్కరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పల్లె దావకాన డాక్టర్ హరినాథ్ ఆదివారం అన్నారు. ఆదివారం నడిగూడెం మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలోని విద్యార్థులకు మలేరియా డెంగ్యూ రాపిడ్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఎవరికి వ్యాధి నిర్ధారణ కాలేదని ఆయన తెలిపారు. అనంతరం హాస్టల్ గదులు టాయిలెట్లు వంటి ప్రాంతాలలో ఆల్ఫా సైబర్ మైత్రి దోమల మందును పిచికారి చేయించారు. సీజనల్ వ్యాధుల సోకకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.