నల్గొండ జిల్లా, గట్టుప్పల్ మండలం, తెరేట్ పల్లి గ్రామంలో సిపిఎం గ్రామ శాఖ సమావేశాన్ని ఆదివారం సాయంత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండారి శ్రీశైలం మాట్లాడుతూ.. గ్రామాలలో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి గ్రామాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం గ్రామ శాఖ నాయకులు తదితరులు పాల్గొన్నారు.