ఇందిరమ్మ ఇండ్లను త్వరగా నిర్మించుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ లబ్ధిదారులకు సూచించారు. బుధవారం జిల్లా కలెక్టర్ తాడ్వాయి మండలం చిట్యాల గ్రామంలోని ఇందిరమ్మ లబ్ధిదారు మమత నిర్మించుకుంటున్న ఇందిరమ్మ ఇంటి నిర్మాణంను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంటి నిర్మాణం త్వరగా పూర్తి చేసుకొని గృహప్రవేశం చేసుకోవాలని లబ్ధిదారుకు సూచించారు. అదేవిధంగా ఈ గ్రామంలో 32 ఇండ్లు మంజూరు కాగా 12 ఇండ్లకు మార్కౌట్ ఇవ్వడం జరిగిందని వాటిలో మూడు ఇండ్లు బేస్మెంట్ లెవెల్, ఒక ఇల్లు రూఫ్ లెవెల్ వరకు నిర్మాణం జరిగాయని ఇప్పుడు ముహూర్తాలు బాగున్నందున మిగతా లబ్ద దారులు ఇంటి నిర్మాణం ప్రారంభించుకోవాలన్నారు