వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో కరాటే పోటీ విజేతలకు ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి బహుమతులను అందజేశారు. పట్టణంలో మార్షల్ ఆర్ట్ ఫోటో కాన్ కరాటే పోటీలను నిర్వహించగా పలువురు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని విజేతలుగా నిలవడంతో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వారికి బహుమతులు అందజేసి అభినందించారు