రేపల్లె వైసిపి ఇంచార్జ్ డాక్టర్ ఈవూరు గణేష్, వేమూరు నియోజకవర్గ వైసిపి ఇన్చార్జి వరికోటి అశోక్ బాబు శనివారం చెరుకుపల్లి మండలం గుళ్ళపల్లిలో అన్నదాత పోరు పోస్టర్ ను ఆవిష్కరించారు. యూరియా సహా రైతులకు అవసరమైన ఎరువులను పంపిణీ చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వారు ఆరోపించారు. ఈనెల 9వ తేదీన ఆర్డీవో కార్యాలయం వద్ద జరిగే అన్నదాత పోరు కార్యక్రమానికి రేపల్లె, వేమూరు నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.