ఏజెన్సీ మారుమూల దట్టమైన అటవీ ప్రాంతాలలో నివసిస్తున్న గిరిజనులకు ఆది కర్మయోగి అభియాన్ పథకంలో భాగంగా సేవ, సంకల్ప, సమర్పణ అనే నినాదంతో వివిధ శాఖల అధికారులు గిరిజనులను చైతన్య పరిచి వారికి కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు.మంగళవారం నాడు భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాహుల్,ఇతర శాఖల అధికారులు మరియు మండల్ లెవెల్, బ్లాక్ లెవెల్ మాస్టర్ శిక్షకులతో ఆది కర్మయోగి అభియాన్ పథకం విజయవంతం అవ్వడానికి మండల్ లెవెల్ శిక్షకుల శిక్షణా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.