వయోజన విద్యా శాఖ ఆధ్వర్యంలో కడప కోటి రెడ్డి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో సోమవారం 59వ అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం ఘనంగా జరిగింది. విద్యార్థులు, అధ్యాపకులు, అధికారులు, వయోజన విద్యా శాఖ సిబ్బంది విశేషంగా పాల్గొనడంతో కళాశాల ఆవరణ సందడి మయమైంది.కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి. సలీం భాషా గారు అధ్యక్షత వహించారు. అధ్యక్ష ఉపన్యాసానికి ముందు ఆయన కవిగా ఒక అర్థవంతమైన కవితను వినిపించి సభలోని ప్రతిఒక్కరి ప్రశంసలు అందుకున్నారు. “అక్షరం మనిషిని వెలుగులోకి నడిపించే దీపస్తంభం” అని ఆయన ప్రేరణాత్మకంగా పేర్కొన్నారు.