జీడి నెల్లూరు నియోజకవర్గం, ఎస్.ఆర్.పురం మండల కేంద్రంలోని ఎర్రకొండలో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న 10 దళిత కుటుంబాలపై జరిగిన దాడిని వైఎస్ఆర్సిపి పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి తెలిపారు. ఆదివారం ఆయన వల్లెమ్మ కుటుంబాన్ని పరామర్శించి, అనాథలైన ఈ కుటుంబాలను బలవంతంగా ఖాళీ చేయించాలని చూస్తే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు.