పేదలకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. మంగళవారం సామర్లకోటలోని మున్సిపల్ కార్యాలయంలో మెప్మా సీఆర్పీలకు టాబ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పేదరికం నిర్మూలనకు గ్రామీణ ప్రాంతాల్లో డ్వాక్రా, పట్టణ ప్రాంతాల్లో మెప్మాని చంద్రబాబు తీసుకొచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మెన్ తుమ్మల బాబు, మున్సిపల్ చైర్ పర్సన్ గంగిరెడ్డి అరుణ, కమిషనర్ శ్రీవిద్య పాల్గొన్నారు.