వైసీపీ అధినేత జగన్ రాష్ట్ర రాజకీయాలకు పట్టిన చీడపురుగు అని మాజీమంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కూటమి నాయకత్వం అంతా కలిసి ఇలాంటి చీడ పురుగును రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. మాణిక్య వరప్రసాద్ గుంటూరులో బుధవారం మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల్లో నయవంచన చేయడం జగన్ కు అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. అలాంటి జగన్ ను ఇప్పటికే ప్రజలు దూరం పెట్టారని అన్ని పార్టీలు కలిసి అతని రాష్ట్రం నుంచి పంపించాలని సూచించారు.