బాపట్ల జిల్లా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఆనంద్ సత్యపాల్ నియమితులయ్యారు. మంగళవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన జిల్లా కలెక్టర్ వెంకట మురళిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఆనంద్ సత్యపాల్ మాట్లాడుతూ మెప్మా విభాగంలో మహిళలకు సకాలంలో నిధులు అందించేలా చర్యలు తీసుకొని వాటిని సద్వినియోగం చేసుకునేలా చూస్తానన్నారు.