రేపు జరగబోయే గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ తరపున పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లను చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు వెల్లడించారు.చంద్రుగొండ మండలంలో రేపు జరగబోయే కార్యక్రమానికి బందోబస్తు విధులు నిర్వర్తించడానికి విచ్చేసిన అధికారులు మరియు సిబ్బందితో మంగళవారం చంద్రుగొండలోని లక్ష్య గార్డెన్స్ నందు సమావేశం ఏర్పాటు చేసి వారికి పలు సూచనలను చేశారు.సుమారుగా 1200 మంది పోలీసులతో ముఖ్యమంత్రి గారి పర్యటనకు బందోబస్తును ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.