ప్రకృతిని ఆరాధిస్తూ జరుపుకునే తీజ్ ఉత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు. శ్రావణ మాసంలో 9 రోజుల పాటు గిరిజన యువతులు తమ సంప్రదాయక పద్ధతుల్లో కుటుంబాలు, ఆవాసాలు సుభిక్షంగా ఉండాలని ప్రార్థిస్తారని తెలిపారు. చివరి రోజున గోధుమ గడ్డి మొలకలు అందుకు ప్రతీకగా భావించి ఉత్సవాలు నిర్వహిస్తారూ భిన్నత్వాలకు ఆలవాలమైన భారతదేశంలో ప్రతి ఒక్కరూ వారి పద్ధతుల్లో సర్వమానవాళి శ్రేయస్సు, పర్యావరణహితం కోసం ఉత్సవాలు నిర్వహిస్తారని తెలిపారు. గిరిజనులంతా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగి సుస్థిరం చేసుకోవాలని పలువురు పిలుపునిచ్చారు.