అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోనే కక్కలపల్లి వద్ద శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల 45 నిమిషాల సమయంలో ఎమ్మెల్యే దగ్గు పడి ప్రసాద్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ ఏర్పాట్లను పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు కూటమిపై నమ్మకం ఉంచి అత్యధిక ఎమ్మెల్యే స్థానాలను గెలిపించడం జరిగిందని, అందుకనే కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని అందులో భాగంగా సూపర్ సిక్స్ సూపర్ హిట్ విజయోత్సవ సభను నిర్వహించబోతున్నామని అందుకు సంబంధించిన ఏర్పాట్లుచేస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.