కాకినాడ జిల్లా, సామర్లకోట పట్టణంలో వంద సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి అగస్టనా లూధరన్ చర్చి నందు, శనివారం ఉదయం నుండి యూత్ కమిటీ వారి ఆధ్వర్యంలో, సంఘ కాపరి రెవరెండ్ శామ్యూల్ ప్రకాష్ అధ్యక్షతన, యూత్ రిట్రీట్ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని, వివిధ సంఘాల నుండి అధిక సంఖ్యలో యువత. వీరికి ఎలిక్యులేషన్, సోలో సింగిల్ గ్రూప్ సింగింగ్ బైబిల్ క్విజ్ వంటి పోటీలను నిర్వహించి, యూత్ కమిటీ సభ్యులచే బహుమతి ప్రవధానాన్ని చేశారు.