ఈనెల 10వ తారీఖు అనంతపురం పట్టణంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమం ఉన్నందున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి లక్షలాది మంది కార్యకర్తలు హాజరవుతున్నారు. ట్రాఫిక్ సమస్యలు ఉండకుండా ముందు జాగ్రత్తగా పోలీసులు ట్రాఫిక్ మళ్ళించారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే వాహనాలు అనంతపురం మీద కాకుండా వడియం పేట బుక్కరాయసముద్రం నాయన పల్లి క్రాస్ బత్తలపల్లి మీదుగా ధర్మవరం వచ్చి ఎన్ ఎస్ గేట్ కు వెళ్లి అక్కడినుండి జాతీయ రహదారిపైకి వెళ్లాలని సూచించారు.