జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సంబంధిత అధికారులను సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాల్ నందు జిల్లా పారిశ్రామిక ఎగుమతులు, ప్రోత్సాహక కమిటీ సమీక్ష సమావేశం జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ... జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని పటిష్టం చేసి.. మరింత విస్తృత పరిచేందుకు అన్ని అనుబంధ శాఖలు సమన్వయంతో జిల్లా ఆర్థిక ప్రగతికి ఆయువు పట్టు అయిన పారిశ్రామిక రంగాన్ని.. మరింత అభివృద్ధి పథంలోకి తీసుకురావాలని సూచించారు.