Kavali, Sri Potti Sriramulu Nellore | Aug 24, 2025
కావలి బిజెపి కార్యాలయంలో ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో జరిగిన విలేకరుల సమావేశంలో బిజెపి పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుండ్లపల్లి భరత్ కుమార్ మాట్లాడుతూ, కావలిలో నేరాలు గోరాలకు మార్గం చూపింది వైసీపీ ప్రభుత్వం మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి అని విమర్శించారు. ప్రతాప్ రెడ్డి డైరెక్షన్లో అనేక దారుణాలు జరిగాయని, వైసీపీ హయాంలో జరిగిన అన్ని అక్రమాలను బయటపెడతామని, తప్పు చేసిన వారిని ఎవరినీ వదిలిపెట్టేది లేదని ఆయన అన్నారు.