రైతాంగ సమస్యలపై ఈ నెల 9న తాడేపల్లిగూడెం ఆర్డీవో కార్యాలయం వద్ద అన్నదాత పోరు కార్యక్రమం నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. ఆదివారం తాడేపల్లిగూడెం తన కార్యాలయంలో విలేకరులు సమావేశం నిర్వహించారు. ప్రధానంగా ఎరువుల బ్లాక్ మార్కెట్, ఉచిత పంటల బీమా, రైతాంగానికి ఎరువులు సరఫరా చేయాలని డిమాండ్తో తమ పార్టీ ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. రైతులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.