సంగారెడ్డిలోని రాజంపేట ప్రాథమిక పాఠశాలలో వనమహోత్సవ కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు పాఠశాల ఆవరణలో ఉత్సాహంగా మొక్కలు నాటారు. ముఖ్య అతిథిగా హాజరైన పోరం ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షుడు శ్రీధర్ మాట్లాడుతూ.. విద్యార్థులు వనమహోత్సవంలో భాగస్వాములు కావడం ఆనందంగా ఉందని చెప్పారు. నాటిన మొక్కలు సంరక్షించుకోవాలని చెప్పారు. విద్యార్థులతో కలిసి వనమాస కార్యక్రమంలో పాల్గొనడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.