నిజామాబాద్ నగరంలో బిజెపి ఆధ్వర్యంలో మహిళల గౌరవాన్ని తక్కువ చేసి మాట్లాడినందుకు రైల్వే స్టేషన్ వద్ద కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోళ్ళ లక్ష్మి నారాయణ మాట్లాడుతూ భారతదేశంలో ప్రజాస్వామ్యం లేదని, ఎన్నికలు సరిగ్గా జరగలేదని అమెరికాలో రాహుల్ గాంధీ భారతదేశ ప్రతిష్టను దెబ్బ తీశారని ఆరోపించారు. దేశంలో ప్రజలు మద్దతు ఇవ్వకుండా రాహుల్ గాంధీని తిరస్కరిస్తే ఏదో కోల్పోయినట్లు రాహుల్ గాంధీ దేశం పట్ల విష ప్రచారం చేస్తున్నారని లక్ష్మి నారాయణ ఘాటుగా స్పందించారు. రాహుల్ గాంధీ తక్షణమే భారతీయులకు క్షమాపణ చెప్పాలన్నారు.