అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ పరిధిలోగల వడ్డాది జడ్పీ హైస్కూల్ అభివృద్ధికి ప్రభుత్వం సమకూర్చిన సిమెంటు బస్తాలు, ఎలక్ట్రికల్ సామగ్రి నిరుపయోగంగా మారాయి. మంగళవారం వార్డు మెంబర్ దొండా నరేశ్, ఎస్ఎంసీ ఛైర్మన్ కోవెల వెంకటరమణ పాఠశాలను సందర్శించారు. సకాలంలో పనులు చేపట్టకపోవడం వలన సిమెంట్ బస్తాలు గడ్డ కట్టేశాయి. నాడు-నేడు పనుల్లో అక్రమాలపై విచారణ చేయాలని కోరారు. దీనిపై హెచ్ఎం ప్రసన్నకళ స్పందిస్తూ.. తాను ఇటీవలే బదిలీపై వచ్చానని తెలిపారు.