ఎల్లారెడ్డి నియోజకవర్గం గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో తీవ్ర ప్రభావానికి గురవుతోంది. వాగులు, వంకలు పొంగిపొర్లడంతో అనేక గ్రామాలు జలమయం కాగా, రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పలు లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజల పరిస్థితిని స్వయంగా పరిశీలించాలని భావించిన స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు, ఎల్లారెడ్డికి చేరేందుకు ప్రయత్నించారు. అయితే, మెదక్, కామారెడ్డి, రామాయంపేట, కుచనపల్లి వంటి అన్ని మార్గాలు వరదల కారణంగా మూసివేయబడ్డాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే హవేళి ఘన్పూర్ వద్ద ఆర్డీవో పరీక్షించారు.