అనంతపురం జిల్లా వ్యాప్తంగా 2,80,471 మందికి పెన్షన్లను అందిస్తున్నామని అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ప్రతినెల రూ. 123.86 కోట్ల రూపాయలు పెన్షన్లకు అందిస్తున్నామని ఆయన వెల్లడించారు. జిల్లాలో 9601 పెన్షన్లను అనర్హులుగా గుర్తించిన వారిలో 7399 మందికి పెన్షన్ అందుతుందని తెలిపారు. ఈనెల 30వ తేదీ సాయంత్రం 5 గంటల లోపల ఎంపీడీవో కార్యాలయంలో అపీల్ చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆత్మారాం పాల్గొన్నారు.