గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో కలుషిత నీటి వలన మరణాలు జరిగాయని వైద్యులు చెబుతుంటే ఈనాడు పత్రికలో హెచ్ఐవి వలన కొన్ని మరణాలు జరిగాయని రాయటం దుర్మార్గం అని ప్రత్తిపాడు నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త బలసాని కిరణ్ కుమార్ మండిపడ్డారు. శనివారం సాయంత్రం తురకపాలెం గ్రామంలో ఆయన పర్యటించారు. మృతి చెందిన కుటుంబాలను పరామర్శించారు. మరణాలకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. తక్షణమే గ్రామంలో మెరుగైన మంచినీటి సౌకర్యం కల్పించాలని, వైద్య సేవలు విస్తృతంగా చేపట్టాలని డిమాండ్ చేశారు. మృతి చెందిన కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలన్నారు.