హిందూపురం పట్టణంలో చిన్న మార్కెట్ సర్కిల్ నుండి మెయిన్ బజార్ మీదుగా గాంధీ సర్కిల్ వరకు స్వర్ణ ఆంధ్రా - స్వచ్ఛ ఆంధ్రా ర్యాలి నిర్వహించారు. ఈ సందర్భంగా మునిసిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ వర్షాలు రావడం వలన మన చుట్టుపక్కల ఎక్కడైనా పాత కుండలలో, టైర్లలో, ప్లాస్టిక్ వస్తువులలో నీరు నిల్వ ఉండడం వలన దోమల ఉత్పత్తి మరింతగా పెరిగి ప్రజలకు మలేరియా, కలరా తదితర విష జ్వరాలతో అనారోగ్యపాలవుతున్నారు. అందువలన నిల్వ నీరు ఎక్కడ కనపడిన తొలగించాలని, ప్రతి రోజు మన ఇంటిని, ఇంటి చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వర్షాకాలంలో పరిశుభ్రత పాటించి తగు జాగ్రతలు తీసుకోవాలని, అదేవిధంగా ప్లాస్టిక్