కూటమి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చిన హామీని నెరవేర్చడంలో విఫలమైందని ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి గ్రీష్మ కుమార్ విమర్శించారు. బుధవారం నిడదవోలు మండలం సెట్టిపేటలో జరిగిన భవన నిర్మాణ కార్మిక సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 14న నిడదవోలులో జరిగే మహాసభకు పెద్ద సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు.