రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ట్రూ అప్ చార్జీలను, పెంచిన చార్జీలను తక్షణం ఉపసంహరించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి.బలరాం డిమాండ్ చేశారు. సోమవారం భీమవరంలో స్థానిక సిపిఎం జిల్లా కార్యాలయంలో సిపిఎం జిల్లా సెక్రటేరియట్ సమావేశం ఆ పార్టీ జిల్లా సెక్రటేరియట్ సభ్యులు కేతగోపాలన్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా హాజరైన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి.బలరాం.. మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రజల ఎదుర్కొనే అనేక సమస్యలపై సమావేశంలో చర్చించామని తెలిపారు.