తప్పేట్ల రైల్వే బ్రిడ్జ్ వద్ద విజ్ఞాన్ స్కూల్ బస్సు బోల్తాకు కారణం బస్సు కు ఫిట్నెస్ లేకపోవడం, డ్రైవర్ మద్యం మత్తువలన జరిగిందని, ఇంతటి నిర్లక్ష్యానికి కారణమైన స్కూల్ గుర్తింపు రద్దు చేసి, యాజమాన్యం పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని RSF రాష్ట్ర అధ్యక్షులు డి.యం. ఓబులేసు యాదవ్ డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బుధవారం సాయంత్రం కమలాపురం విజ్ఞాన్ స్కూల్ బస్సు రైల్వే బ్రిడ్జ్ వద్ద బోల్తా పడింది, దీనిలో 45 మంది పిల్లలు గాయపడ్డారు. కానీ ఈ ప్రమాదంలో మొత్తం బస్సు బ్రిడ్జ్ కల్వర్టు పైకి దూసుకుపోయి రైల్వే ట్రాక్ మీదకు వెళ్లిందంటే డ్రైవర్ నిర్లక్ష్యమే అన్నారు.