మాకు పెద్దల నుంచి సక్రమించిన 76 ఎకరాల పట్టా భూమికి పాసుబుక్కులు చేయించి ఇవ్వాలని పలువురు సోమవారం కుందుర్పి తహశీల్దార్ ఓబులేసుకు వినతి పత్రం అందజేశారు. కుందుర్పి కి చెందిన ఓబన్న హనుమంతు రాయుడు, హనుమంతప్ప, మారెన్న తదితరులు రెవెన్యూ కార్యాలయానికి వెళ్లారు. గత రెండు సంవత్సరాలుగా పాసు బుక్కులు కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నామన్నారు. వెంటనే పాస్ బుక్కులు మంజూరు చేయాలని విన్నవించారు. తహశీల్దార్ వెంటనే స్పందించారు. విచారణ చేసి పాసు బుక్కులు మంజూరు చేయాలని వీఆర్వో ను ఆదేశించారు