మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా దేవరకద్ర నియోజకవర్గం అడ్డాకుల మండలం రాచాల గ్రామానికి చెందిన వెంకటయ్య మట్టి ఇల్లు కూలిపోయింది. అదృష్టవశాత్తు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం సంభవించలేదు. గ్రామస్తులు బాధితునికి తక్షణ సహాయం అందించాలని అధికారులను, ప్రభుత్వాన్ని కోరుతున్నారు.