హనుమంతునిపాడు: మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన నిందితుడికి ఒంగోలు పోక్సో ఏడేళ్లు జైలు శిక్ష, జరిమానా విధించినట్లు ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్ సోమవారం తెలిపారు. హనుమంతుని పాడు మండలానికి చెందిన 12 సంవత్సరాల మైనర్ బాలికను అదే మండలానికి చెందిన ధనంకుల తిరుపతయ్య అనే వ్యక్తి బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి అసభ్యంగా ప్రవర్తించడంతో , బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారని ఎస్పీ తెలిపారు. నేరం రుజువు కావడంతో ఒంగోలు పోక్సో కోర్టు జడ్జ్ శైలజ నిందితుడికి మూడేళ్లు జైలు శిక్ష, రూ.7 వేలు జరిమానా విధించినట్లు తెలిపారు.