చీమకుర్తి పట్టణంలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం నూతన పాలకవర్గాన్ని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం పాలకవర్గం అధ్యక్షునిగా పాల్వాది పవన్ కుమార్ ఎన్నికయ్యారు. ఇతర కార్యవర్గ సభ్యుల వెనక కూడా ఏకగ్రీవమైంది. నూతన పాలకవర్గ అధ్యక్షునిగా ఎన్నికైన పవన్ కుమార్ , మరియు కమిటీ సభ్యుల చేత ఆలయ అధికారులు ప్రమాణస్వీకారాన్ని చేయించారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.