Download Now Banner

This browser does not support the video element.

త్రిపురారం: పెద్దదేవులపల్లి గ్రామంలో పెండింగ్ వేతనాలు చెల్లించాలని వాటర్ ప్లాంట్ బంద్ చేసి కాంటాక్ట్ కార్మికుల ధర్నా

Thripuraram, Nalgonda | May 9, 2025
నల్గొండ జిల్లా, త్రిపురారం మండల పరిధిలోని పెద్దదేవులపల్లి గ్రామంలో పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్టు కార్మికులు వాటర్ ప్లాంట్ ను బందు చేసి శుక్రవారం సాయంత్రం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత 11 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ వేతనాలతో పాటు పిఎఫ్, ఈఎస్ఐ ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పోలే సత్యనారాయణ, ఇస్లావత్ చందు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us