నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చైన్ స్నాచింగ్ ఘటన కలకలం రేపింది. సోమవారం రాత్రి 4 ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. గాయత్రి నగర్ ప్రాంతంలో పద్మ అనే మహిళ బీడీ కార్ఖానాకు వెళ్లి, ఇంటికి తిరిగి వస్తుండగా బయట వచ్చిన ఇద్దరు దుండగులు మైదా మెడలో నుంచి బంగారు చేను అపహరించి పరారయ్యారు. దళిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు. గొలుసు సుమారు రెండున్నర తులాలు ఉంటుందని ఆయన పేర్కొన్నారు.