భిక్కనూరు మండలం ర్యాగట్లపల్లి గ్రామంలో గుప్త నిధుల కలకలం సృష్టించింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భిక్కనూరు, ర్యాగట్లపల్లి, మెదక్ జిల్లా రామాయంపేట చెందిన దాదాపు పదిమంది ముఠాగా చేరి ర్యాగట్లపల్లి గ్రామంలో పురాతన బసవేశ్వర ఆలయంలో శనివారం మధ్యాహ్నం జెసిబి తో తవ్వకాలు జరుగుతుండగా గ్రామస్తులు గుర్తించి పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని పారిపోతున్న వారిని పట్టుకుని జెసిబి తో పాటుగా భిక్కనూరు పోలీసులకు అప్పగించారు. గుప్త నిధులు తవ్వుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేశారు. ఈమెకు పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై ఆంజనేయులు పేర్కొన్నారు.