జగిత్యాల జిల్లా,కొడిమ్యాల మండలం,నాచుపల్లి గ్రామ శివారులో సైకిల్పై వెళ్తున్న వ్యక్తిని ద్విచక్ర వాహనదారుడు ఢీకొన్న సంఘటన గురువారం 8:20 PM కి చోటుచేసుకుంది,లచ్చయ్య అనే భక్తుడు సైకిల్ పై కొండగట్టుకు వెళ్తుండగా,సురేందర్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై వస్తు నాచుపల్లి గ్రామ శివారులో లచ్చయ్య సైకిల్ ను ఢీకొట్టాడు,దీంతో రోడ్ పై పడిపోయిన లచ్చయ్యకు ద్విచక్ర వాహనదారుడు సురేందర్ కు తీవ్ర గాయాలయ్యాయి,స్థానికుల సహాయంతో 108 లో చికిత్స నిమిత్తం జగిత్యాల ఆస్పత్రికి తరలించారు,ఇంకా ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది,