Kandukur, Sri Potti Sriramulu Nellore | Sep 5, 2025
'మా భూములు ఇవ్వం.. మా ఊరుని ఖాళీ చేయం’ అంటూ కరేడు రైతులు, గిరిజన కాలనీవాసులు మరోసారి స్పష్టం చేశారు. భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఇచ్చిన నోటీసులకు సమాధానంగా వారంతా కావలిలో అధికారిని కలిసి తమ అసమ్మతిని రాతపూర్వకంగా తెలిపారు. కార్య క్రమంలో సీఐటీయు జిల్లా నాయకుడు అజయ్ కుమార్, రైతు కూలీ సంఘ నాయకుడు సాగర్, తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో జరిగింది.