తవణంపల్లి మండలంలోని గాజులపల్లె గ్రామంలో ఆదివారం మహాభారత యజ్ఞం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ ముఖ్య అతిథిగా హాజరై, రాజసూయ యోగం హరిలకధ ఘట్టాన్ని ఆసక్తిగా వీక్షించారు. ఆయన చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది. గ్రామస్తులు, భక్తులు కలిపి సుమారు వెయ్యి మందికి పైగా భోజనాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహాభారతం అనేది భారతీయ సంస్కృతికి మూలాధారం. రాజసూయ యోగం వంటి ఘట్టాలు నీతి, ధర్మం, నాయకత్వం గురించి మనకు బోధిస్తాయి. ఇలాంటి యజ్ఞాలు సమాజంలో సత్సంగతిని, శాంతిని, ఐకమత్యాన్ని పెంపొందిస్తాయి అని పేర్కొన్నరు.