సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో గ్రామపంచాయతీ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో శుక్రవారం జిల్లా కలెక్టర్ కె. హైమావతి, జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ అబ్దుల్ హమీద్ తో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో 508 గ్రామపంచాయతీలలో 4508 పోలింగు స్టేషన్ లలో 1- 7- 2025 తేదీ వరకు 6,55,958 ఓటర్లు ఉన్నారని.. ఈ 508 గ్రామపంచాయతీలలో ఓటర్ లిస్ట్ పబ్లిష్ చేయడం జరుగుతుందని.. వేరు వేరుగా ఇంటి నెంబర్ ఉన్న కుటుంబ సభ్యులను ఒకే వార్డులో చేర్చే సవరణ చేయడం జరిగిందనీ