రీజినల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ ను ఉపసంహరించుకోవాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ కలెక్టర్ ప్రావిణ్యను శనివారం కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మాట్లాడుతూ రీజినల్ రింగ్ రోడ్ లో భూములు కోల్పోతున్న కొండాపూర్ మండల రైతులకు న్యాయం చేయాలని కోరారు. త్రిబుల్ ఆర్ బాధిత రైతులతో కలిసి జిల్లా కలెక్టర్ ను ఎమ్మెల్యే కలిసి వినతిపత్రం అందజేయడంతో పాటు వారికి తగిన న్యాయం చేయాలని పేర్కొన్నారు. ఉన్న కొద్దిపాటి పొలంను కోల్పోతున్న రైతులను ఆదుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో రైతులు టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.