చీరాల ప్రాంతంలో భీభత్సం సృష్టిస్తున్న మల్లెల రాజేష్ నాయకత్వంలోని ఐదుగురు సభ్యుల ర్యాంపు ముఠాను అరెస్టు చేసినట్లు డీఎస్పీ మోయిన్ ఆదివారం మీడియాకు తెలిపారు.విజయవాడకు చెందిన రెహమాన్ అనే వ్యక్తిని ఈ ముఠా ఇటీవల తక్కువ ధరకు ఎక్కువ బంగారం ఇస్తామని ఆశ చూపి చీరాల రప్పించి దాడి చేసి 4లక్షల రూపాయల నగదు దోచుకున్న ఘటన తెలిసిందే.ఈ కేసులో వారిని అరెస్టు చేసి 3 లక్షలనగదు రికవరీ చేశామన్నారు.ఈ ముఠాలో ఓ మహిళ కూడా ఉంది.