పోడు సాగుదారులపై ఫారెస్ట్ అధికారుల దాడులు ఆపాలని భద్రాద్రి జిల్లా కలెక్టరేట్ ఎదుట సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించి,అనంతరం కలెక్టరేట్ల్ లో వినతి పత్రం అందజేసిన నాయకులు.ఈ సందర్భంగా పార్టీ జిల్లా నాయకులు నిమ్మల రాంబాబు మాట్లాడుతూ.. పాల్వంచ మండలం మందెరికలపాడు గ్రామం ఆదివాసి పేదలు సాగు చేసుకుంటున్న పోడు భూములలో ఉన్న పత్తి పంటను ఫారెస్ట్ అధికారులు కొందరి కిరాయి మనుషులను వెంటబెట్టుకొని 2 ఎకరముల పత్తి చెట్లను పీకి వేసి పంట ధ్వంసం చేశారని. ఉలవనూరు గ్రామానికి చెందిన పూణెం రమేష్ కు చెందిన మూడు ఎకరాల పత్తి పంటను పీకి ధ్వంసం చేశారన్నారు.